యంగ్ హీరో నానికి ఫిబ్రవరి నెల చాలా కీలకంగా మారనుంది. చాలా కాలంగా నాని నటించిన సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. దాన్ని మార్చడానికే నాని 4 వారాల గ్యాప్ లో 3 సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. నాని నటించిన ‘పైసా’, ‘జెండాపై కపిరాజు’, ‘ఆహా కళ్యాణం’ సినిమాలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి.
కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘పైసా’ సినిమా మొదటగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేథరిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చాలాకాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఆలస్యం అయ్యింది. ‘పైసా’ తర్వాత ఒక వారం గ్యాప్ లో ఫిబ్రవరి 14న ‘జెండాపై కపిరాజు’ విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాని డబుల్ రోల్ చేసాడు.
అలాగే చివరి సినిమా బాలీవుడ్ ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమాకి రీమేక్ అయిన ‘ఆహా కళ్యాణం’ సినిమాని ఫిబ్రవరి 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. 4 వారాల గ్యాప్ లో 3 సినిమాలతో వస్తున్న నాని ఈ నెలంతా ఎక్కువగా అనడరికీ కనపడటమే కాకుండా, ఎన్ని విజయాలను అందుకుంటాడో చూడాలి.