ట్రైలర్ తర్వాత ‘మిరాయ్’ పై మరిన్ని అంచనాలు!

ట్రైలర్ తర్వాత ‘మిరాయ్’ పై మరిన్ని అంచనాలు!

Published on Aug 29, 2025 9:00 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “మిరాయ్”. భారీ విజువల్ అండ్ యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి మైండ్ బ్లాకింగ్ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయడంతో దీనితో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ తర్వాత మిరాయ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా సినిమా విజువల్స్ ఇంకా డివోషనల్ టచ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అంతే కాకుండా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కోసం తెలిసిన ఆడియెన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. రవితేజతో ఈగల్ సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని వర్క్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మాత్రం మిరాయ్ కి సాలిడ్ హైప్ ట్రైలర్ తర్వాత ఏర్పడింది. మరి దీనిని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఈ సెప్టెంబర్ 12 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు