చిరు – అనీల్ ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్!

చిరు – అనీల్ ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్!

Published on May 21, 2025 2:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “విశ్వంభర”. అయితే ఈ చిత్రం తర్వాత చిరు వెంటనే దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తుండగా ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే సాలిడ్ బజ్ ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇపుడు తెలుస్తుంది. చిరంజీవికి రీసెంట్ గానే లుక్ టెస్ట్ ని మేకర్స్ కంప్లీట్ చేశారట.

మెయిన్ గా వింటేజ్ లుక్ ని ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ప్రస్తుతానికి మెగాస్టార్ లుక్ లాక్ చేసుకొని షూటింగ్ ని సన్నద్ధం కానున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా వీలైనంతవరకు మెగాస్టార్ ని స్టైలిష్ లుక్ లోనే ప్రెజెంట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు కూడా టాక్. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు