క్రేజీ హీరోయిన్ కి ఫుల్ రెమ్యునిరేషన్ కావాలట !

క్రేజీ హీరోయిన్ కి ఫుల్ రెమ్యునిరేషన్ కావాలట !

Published on Aug 17, 2020 4:01 PM IST

క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కి కాస్త యాక్టింగ్ స్కిల్ అండ్ కొంచెం ఫాలోయింగ్ ఉంటే చాలు.. ఇక ఆ హీరోయిన్ కి భారీగా రెమ్యూనిరేషన్ ఇస్తారు, దానికితోడు వరుస హిట్స్ వస్తే మాత్రం ఆ హీరోయిన్ కి ఇక తిరిగులేదు. అయితే కరోనా కారణంగా స్టార్ హీరోయిన్లు కూడా తమ రెమ్యునిరేషన్ ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మాత్రం ఎప్పటిలాగే ఫుల్ రెమ్యునిరేషన్ డిమాండ్ చేస్తోందట.

రీసెంట్ గా సూపర్ స్టార్ తో సూపర్ హిట్ అందుకోవడంతో పాటు మరో యంగ్ హీరో నితిన్ తో కూడా సూపర్ హిట్ అందుకుంది. పైగా చేతిలో బన్నీ సినిమా ఉంది. పైగా స్టార్స్ పక్కన తప్ప యంగ్ హీరోలతో ఇక సినిమాలు చేయనట్టే కనిస్తోంది. స్టార్ డమ్ లేని హీరోల ప్రాజెక్ట్ లు తన దగ్గరకు వచ్చినా వాటికీ నో చెబుతునట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని అడుగుతూ.. భారీ ఆఫర్స్ నే అందుకోవాలని ఆ క్రేజీ బ్యూటీ ప్లాన్. మరి ఈ హీరోయిన్ డిమాండ్లను ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారో చూడాలి.

తాజా వార్తలు