క్రేజీ బజ్: ‘ఓజి’ మరో టీజర్ కి డేట్ కన్ఫర్మ్?

క్రేజీ బజ్: ‘ఓజి’ మరో టీజర్ కి డేట్ కన్ఫర్మ్?

Published on Jul 16, 2025 9:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లో భారీ హైప్ ని సంతరించుకుంది. అయితే రిలీజ్ కి ఆన్ టైం వచ్చేందుకు సిద్ధంగా ఈ ప్రాజెక్ట్ పై మరో సాలిడ్ బజ్ వినిపిస్తుంది.

దీనితో మేకర్స్ మరో విధ్వంసకర టీజర్ ని వదిలే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్. దీనితో ఓజి మరో టీజర్ ఈ ఆగస్ట్ 15కి అలా సిద్ధం చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. జస్ట్ సింగిల్ గ్లింప్స్ తోనే ఓజి పై అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి. కేవలం దీనితోనే 300 కోట్లకి పైగా బిజినెస్ ని సినిమా చేస్తుంది. మరి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇదే రేంజ్ లో ఉంటే ఎవ్వరూ ఊహించని రేంజ్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వస్తాయని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు