కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘కోర్ట్’ భామ శ్రీదేవి


న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన ‘కోర్ట్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యువ జంటగా హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా సక్సెస్‌తో ఇప్పుడు వీరిద్దరు వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నారు.

తాజాగా యంగ్ బ్యూటీ శ్రీదేవి తమిళ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ నిర్మాత కమ్ నటుడు కెజెఆర్ నటిస్తున్న రెండో చిత్రాన్ని తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను మినిస్టూడియోస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి నటిస్తుంది. ఇక ఈ పూజా కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ఉన్నాడు.

ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను రేగన్ స్టానిస్లాస్ డైరెక్ట్ చేస్తుండగా గిబ్రాన్ సంగీతం అందించనున్నాడు.

Exit mobile version