బాలయ్య సిగ్నేచర్‌ను రీ-క్రియేట్ చేసిన దిల్ రాజు..!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా వేడుకల్లో ఎంత హుషారుగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన తనదైన స్వాగ్‌తో ఆ వేడుకకు మరింత సందడి తీసుకొస్తారు. ఇక బాలయ్య చేసే కొన్ని పనులు అభిమానులను అవాక్కయ్యేలా చేస్తాయి. అందులో బాలయ్య మార్క్ సిగ్నేచర్ అంటూ కొన్ని ఉన్నాయి.

సెల్‌ఫోన్‌ను గాల్లో తిప్పుతూ చాలా సార్లు బాలయ్య సందడి చేశాడు. అయితే, తాజాగా అమెరికాలో జరుగుతున్న తెలుగు సంబరాలు వేడుకలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలయ్య మార్క్ సిగ్నేచర్‌ను రీ-క్రియేట్ చేశారు. బాలయ్య పక్కన కూర్చున్న ఆయన తన సెల్‌ఫోన్‌ను గాల్లోకి ఎగరేశారు. ఇది చూసిన బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని అవాక్కయ్యారు.

ఇలా బాలయ్య చేసే సిగ్నేచర్ మార్క్‌ను దిల్ రాజు కాపీ కొట్టడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version