‘వార్-2’ చిత్రానికి స్పెషల్ ప్రీమియర్స్.. గట్టిగా ప్లాన్ చేస్తున్న సితార..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్-2’ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తుండటంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ‘వార్-2’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ రూపొందిస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక, ఎన్టీఆర్ అభిమానుల కోసం ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున స్పెషల్ ప్రీమియర్స్ వేయాలని నాగవంశీ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఆయన అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో దేవర చిత్రానికి కూడా ఇలా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.

ఇప్పుడు అదే స్ట్రాటజీతో నాగవంశీ ముందుకెళ్లాలని చూస్తున్నారు. మరి ‘వార్-2’ చిత్రానికి ప్రీమియర్ షోలు వేసేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ‘వార్-2’ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version