గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపెట్టేందుకు బాలయ్య సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో చేయనున్నాడు.
బాలయ్య కెరీర్‌లో 111వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను గోపీచంద్ డైరెక్ట్ చేయనుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, NBK111 చిత్రంపై దర్శకుడు గోపీచంద్ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమెరికాలో జరుగుతున్న తెలుగు సంబరాల్లో పాల్గొన్న గోపీచంద్ మలినేని, NBK111 చిత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని.. ఈ సినిమాలో బాలకృష్ణ కొత్త యాంగిల్ చూస్తారని ఆయన తెలిపారు.
దీంతో ఈ సినిమాపై అప్పుడే దర్శకుడు అంచనాలు పెంచేశాడని అభిమానులు అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించేందుకు గోపీచంద్ రెడీ అవుతున్నారు.