టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ వారం కూడా చిన్న సినిమాల హవా కనిపించనుంది. ఇందులో సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న ‘ఓ భామ అయ్యో రామా’ జూలై 11న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక అదే రోజున ఆర్కే సాగర్ హీరోగా నటిస్తున్న ‘ది 100’ కూడా రిలీజ్ కానుంది. హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సూపర్‌మ్యాన్’ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఇండియన్ భాషల్లో రిలీజ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘మాలిక్’ చిత్రం కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది.
ఇక ఓటీటీలో కూడా పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ :
ఆప్ జైసా కోయి (హిందీ) – జూలై 11
జియామ్ (ఇంగ్లీష్) – జూలై 9
సెవెన్ బేర్స్ (యానిమేషన్) – జూలై 10
బ్రిక్ (ఇంగ్లీష్) – జూలై 10
8 వసంతాలు – జూలై 11
సోనీ లివ్ :
నరివెట్ట (మలయాళం) – జూలై 11
జియో హాట్‌స్టార్ :
మూన్ వాక్ (మలయాళం) – జూలై 08
స్పెషల్ ఓపీఎస్ (వెబ్ సిరీస్ సీజన్ 2) – జూలై 11
బుక్ మై షో :
గుడ్ వన్ (హాలీవుడ్) – జూలై 08