నితిన్ తను నటిస్తున్న రెండు సినిమాలు ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’, ‘హార్ట్ ఎటాక్’ లనుముగించుకునే పనిలో వున్నాడు
ముఖ్యంగా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ఈ వారంలో యామీ గౌతమ్ ఈ చిత్ర షూటింగ్ పాల్గొనుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళ మరియు తెలుగు బాషలలో తెరకెక్కిస్తున్నారు
ప్రభుదేవ స్కూల్ నుండి వచ్చిన ప్రేమ్ సాయి ఈ సినిమాద్వారా దర్శకుడిగా పరిచయంకానున్నాడు. ఈ సినిమాను ‘ఫోటాన్ కతాస్ బ్యానర్’ పై గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నాడు