కరోనా ఎఫెక్ట్ తో పెరిగిన సినిమా కష్టాలు !

కరోనా ఎఫెక్ట్ తో పెరిగిన సినిమా కష్టాలు !

Published on Apr 18, 2020 12:00 AM IST

కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా భారత్‌ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరో పక్క బంద్ కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ తో థియేటర్స్‌ అన్ని మూసేశారు. సినిమాల షూటింగ్ లు ఆపేశారు. దాంతో కృష్ణ నగర్ కష్టాలు సినిమా పక్షుల్లో ఎక్కువైపోయాయి. ఇప్పటికే ప్రభుత్వం మే 3 వరకూ బంద్ ప్రకటించింది. ఆ తరువాత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

దాంతో చిన్న నిర్మాతల దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ లు వరకూ అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎగురుకుంటున్నారు. మళ్ళీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. దేశవ్యాప్తంగా క్లోజ్ లో ఉన్న థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. కాగా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సినీ జనాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సినిమా లోకం తమ ఆవేదనను వ్యక్తం చేస్తోంది. సినిమాల్లో పని చేసే చాలామంది కార్మికులు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హులు కాదు. దాంతో సినిమా జనంలో చాలామందికి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందట్లేదు. అందుకే సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమైన కేసియార్ ప్రభుత్వం సినిమా రంగంలోని కార్మికులను గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు