కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!

కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!

Published on Aug 18, 2025 7:00 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కించుకున్న కూలీ తొలి వీకెండ్ ముగిసే సరికి బాక్సాఫీస్ దగ్గర మరింత పుంజుకుని దూసుకెళ్లింది.

కూలీ చిత్రం ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.404 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించారు. తమిళ సినిమా చరిత్రలో ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కూలీ కొత్త రికార్డు క్రియేట్ చేసిందని వారు ప్రకటించారు. రజినీ మేనియాకు లోకేష్ మ్యాజిక్ తోడు కావడంతో ఈ వండర్స్ జరుగుతున్నాయని వారు తెలిపారు.

ఇక ఈ సినిమాలో నాగార్జున, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు