అక్కడ ‘కూలీ’ టికెట్ బుకింగ్స్ తెరుచుకునేది ఆ రోజే..!

అక్కడ ‘కూలీ’ టికెట్ బుకింగ్స్ తెరుచుకునేది ఆ రోజే..!

Published on Jul 11, 2025 7:00 AM IST

తమిళ స్టార్ హీరో రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అమెరికాలో కూలీ చిత్రంపై భారీ బజ్ నెలకొంది. దీంతో ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను జూలై 24 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

దీంతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు