ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ‘కూలీ’ కి భారీ సంఖ్యలో బుకింగ్స్!

COOLIE Rajinikanth

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. గట్టి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం తెలుగు యువత కూడా మంచి ఆసక్తిగా ఉన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూలీ క్రేజీ బుకింగ్స్ ని నమోదు చేస్తుంది.

నిన్ననే తెలుగు బుకింగ్స్ ఓపెన్ కాగా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 4 లక్షలకి పైగా టికెట్స్ బుక్ అయినట్టుగా అధికారికంగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో కూలీ మేనియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఆ అంచనాలు ఏ మేరకి అందుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఉపేంద్ర, కింగ్ నాగ్, అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ కూడా నటించారు. అలాగే సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

Exit mobile version