బుల్లితెరపై సత్తా చాటేందుకు సిద్ధమైన ‘కూలీ’

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్‌గా, అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.

ఇక ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. జెమినీ టీవీలో ‘కూలీ’ చిత్రాన్ని అక్టోబర్ 19, 2025 న సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు. దీంతో ఆదివారం రోజున ఇంటిల్లిపాది తలైవా సినిమాను చూసేందుకు అభిమానులు కూడా రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాపై భారీ హైప్ సృష్టించడంలో కీలకంగా నిలిచింది.

Exit mobile version