అలీ, నియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మా గంగానది’. అలీ ఈ చిత్రంలో లాయర్ పాత్ర చేస్తుండగా, ఆడవారి ప్రధాన్యం మరియు విశిష్టత తెలిపే చిత్రంగా తెరకెక్కుతుంది. ఐతే ఈ చిత్రంతో అలీ కుమార్తె బేబీ జువేరియా నటించడం విశేషం. ఈ చిత్రం ద్వారా ఆమె బాలనటిగా ఎంట్రీ ఇస్తుంది. మా గంగానది మూవీలో జువేరియా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉన్నట్లు తెలుస్తుంది.
అలీ సైతం చాల చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి ప్రవేశించారు. తండ్రి వారసత్వం తీసుకున్న జువేరియా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. రవికుమార్ సమర్పణలో మూగాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.బాల నాగేశ్వరరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వేసవి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.