డి.టి.ఎస్ మిక్సింగ్లో రాంబాబు

డి.టి.ఎస్ మిక్సింగ్లో రాంబాబు

Published on Oct 7, 2012 9:50 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ఈ నెల 18న భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించగా, గాబ్రియేల బెర్తంతే ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య మాట్లాడుతూ ”కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా భారీ ఎత్తున అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సంబందించిన డబ్బింగ్ మరియు రీ రికార్డింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం డి.టి.ఎస్ మిక్సింగ్ కార్యకరమాలు జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ రికార్డులను క్రాస్ చేస్తుందన్న నమ్మకం ఉంది. పవన కళ్యాన్ నటన మరియు పూరి డైరెక్షన్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయని’ ఆయన అన్నారు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో పవన్ మరియు తమన్నా టీవీ జర్నలిస్టులుగా కనిపించనున్నారు.

తాజా వార్తలు