విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో

విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో

Published on Sep 26, 2012 5:42 PM IST


‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆడియోను విడుదల చేసారు. ఈ చిత్ర ఆడియో ఈ రోజు ఉదయం నుంచే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆడియో కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ ‘ హిట్/ఫ్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక సంచలనం మరియు ఆయన అభిమానులకు ఒక పండగ. పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి అనుబందం ఉంది, ఆయన నటించిన ‘తొలి ప్రేమ’, ‘ఖుషి’ మరియు ‘గబ్బర్ సింగ్’ చిత్రాలను నైజాంలో నేనే డిస్ట్రిబ్యూట్ చేసాను. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి, అలానే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని కూడా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాదిస్తుందన్న నమ్మకం ఉందని’ ఆయన అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు