“కేజీయఫ్ 2″లో ప్రకాష్ రాజ్ రోల్ పై క్లారిటీ?

ఇప్పటికే మన దేశంలో ఉన్న ఎన్నో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్ “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటికి కనుక పరిస్థితులు బాగుంది ఉన్నట్టయితే టీజర్ కూడా వచ్చేసి ఉండేది. అయితే గత రెండు రోజుల కితమే షూటింగ్ మొదలు కాబడిన ఈ చిత్రంకు సంబంధించి ఒక అంశం హాట్ టాపిక్ లా మారింది.

ఈ చిత్రం షూటింగ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీదనే మొదలు కావడంతో మొదటి భాగంలో రిపోర్టర్ గా కనిపించిన అనంత్ నాగ్ రోల్ ను రీప్లేస్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి మరో క్లారిటీ వినిపిస్తుంది. ఏఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ రోల్ పూర్తిగా కొత్తది అని అలాగే ఈ రెండో భాగంకు రిలేటెడ్ గా పరిచయం కానుంది అని తెలుస్తుంది. మొత్తానికి అనంత్ నాగ్ రోల్ విషయంలో మాత్రం ఇపుడు ఇది సస్పెన్స్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Exit mobile version