‘మిరాయ్’లో ప్రభాస్ క్యామియోపై అందరికీ క్లారిటీ!

‘మిరాయ్’లో ప్రభాస్ క్యామియోపై అందరికీ క్లారిటీ!

Published on Sep 12, 2025 9:00 PM IST

లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రమే “మిరాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ఫీస్ట్ సినిమా రిలీజ్ అయ్యి సాలిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి రెండు సర్ప్రైజ్ లు సినిమాలో ఉన్నాయని మేకర్స్ చెప్పారు.

అలా సినిమా ఆరంభమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ తో ఉంటుంది అని నిన్న రాత్రి షో తోనే క్లారిటీ వచ్చేసింది. కానీ అదే కాకుండా ప్రభాస్ ప్రెజెన్స్ కూడా సినిమాలో ఉందని తనపై విజువల్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. కానీ నిజానికి అవేమి సినిమాలో లేవు. కేవలం ప్రభాస్ వాయిస్ ఓవర్ తోనే ఉంది తప్పితే తాను స్పెషల్ క్యామియో లాంటివి చేయలేదు. సో రెబల్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొంచెం అంచనాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది.

తాజా వార్తలు