బాహుబలి ది ఎపిక్: లేపేసిన సీన్స్ అన్నీ ఇవే

బాహుబలి ది ఎపిక్: లేపేసిన సీన్స్ అన్నీ ఇవే

Published on Oct 29, 2025 4:31 PM IST

Baahubali The Epic

ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ రీ రిలీజ్ చిత్రమే బాహుబలి ది ఎపిక్. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రభాస్, రానా లతో తెరకెక్కించిన ఈ హిస్టారికల్ ఎపిక్ రెండు భాగాలు కలిపి ఇప్పుడు ఒక్క పార్ట్ గా రాబోతుంది. దాదాపు 6 గంటల దగ్గర సినిమాని ఇప్పుడు 3 గంటల 43 నిమిషాల సినిమాగా తీసుకొస్తున్నారు. అంటే చాలానే సీన్స్ లేపేసినట్టే అని అందరికీ ఓ క్లారిటీ ఉంది.

కానీ అసలు ఏమేం తీసేసారు అనేది ఇపుడు స్వయంగా జక్కన్న రివీల్ చేసారు. శివుడు, అవంతిక లవ్ స్టోరీ, పచ్చ బొట్టేసిన సాంగ్, రాజమౌళికి ఇష్టమైన సాంగ్ కన్నా నిదురించరా ఇంకా మనోహరి సాంగ్ దాదాపు పాటలు ఇంకా వార్ సీక్వెన్స్ లలో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసేసామని తెలిపారు. ఇక అంతేకాకుండా ఈ సింగిల్ పార్ట్ మొత్తం, సీన్ టు సీన్ కథ, ఎమోషన్ తో సాగుతుంది అని రివీల్ చేశారు. సో థియేటర్స్ లో ఫ్యాన్స్ ఇందుకు సిద్ధంగా ఉండాలి.

తాజా వార్తలు