కన్నడ టాలెంటెడ్ నటుడు అలానే దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. పాన్ ఇండియా లెవెల్లో ఒక డివోషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి కూడా సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వారి రీసెంట్ గానే ఈ అక్టోబర్ 31 నుంచే అందుబాటులోకి వస్తుంది అని కన్ఫర్మ్ చేసేసారు.
అయితే దీనికి ముందు ఓ క్లారిటీ బయటకు వచ్చింది. కాంతార ఇప్పుడు కేవలం కన్నడ, తెలుగు ఇంకా కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే రానుంది. హిందీపై క్లారిటీ లేదు. అయితే ఇది మాత్రం మొత్తం 8 వారాల రన్ తర్వాత మాత్రమే రానుంది అని ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. సో హిందీలో అప్పుడు వరకు కాంతార రన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చు.


