మెగాస్టార్ చిరంజీవి ఈ లాక్డౌన్ సమయంలో తనకు ఇష్టం వచ్చిన వ్యాపకాలలో మునిగిపోతున్నారు. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సేకరించడంతో పాటు తన ఇంటి ఆవరణలోని గార్డెన్ పనులు స్వయంగా చూసుకుంటున్నారు. మొక్కలకు నీళ్లు పోయడం, వాటికి పోషణ చేయం వంటివి చేస్తున్నారు. నేడు చిరంజీవి ఇంటి దారిని శుభ్రంగా నీటితో కడిగారు. ఆ వీడియోని చిరంజీవి ట్విట్టర్ లో పంచుకున్నారు. ”మనం నడిచే దారి శుభ్రంగా ఉంచుకోవాలని” ఆయన ట్వీట్ లో పొందుపరిచారు. ఆ పదాలలో సక్సెస్ కోసం మనం ఎంచుకొనే దారి నీతిబద్ధమైనది అయి ఉండాలి అనే అర్థం కూడా ఇస్తుంది.
ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. చరణ్ ఈ మూవీలో ఓ కీలక రోల్ చేస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
The paths we take should always be clean #LockdownActivities #StayHomeStaySafe pic.twitter.com/7Ie4frsTut
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 16, 2020