మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ గా చేసిన అంశాలలో ఆయన డాన్స్ ఒకటి. భరత నాట్యం లో ప్రావీణ్యం ఉన్న చిరంజీవి అప్పట్లో డాన్స్ విషయంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇక వయసుతో సంబంధం లేకుండా చిరు తన స్టెప్స్ లో గ్రేస్ చూపిస్తున్నారు. భారీ గ్యాప్ తరువాత ఆయన చేసిన ఖైదీ 150లో ఆయన స్టెప్స్ ప్రత్యేకంగా నిలిచాయి. కాగా ఆయన 152వ చిత్రంలో కూడా చిరు స్టెప్స్ ఓ రేంజ్ లో ఉంటాయట.
దర్శకుడు కొరటాల శివ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఆయన ట్యూన్స్ కి చిరు రెచ్చిపోయి స్టెప్స్ వేయడం ఖాయం అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రోల్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.