చిరు నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి

మెగాస్టార్ చిరు 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొరటాల తనదైన శైలిలో కమర్షియల్ హంగులకు సోషల్ మెసేజ్ కలిపి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం యొక్క తర్వాతి షెడ్యూల్ రాజమండ్రిలో జరగనుంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ నుండి కథానాయిక త్రిష చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం.

మొడటిసారి చిరు, కొరటాల కలిసి చేస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ఆచార్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.

Exit mobile version