‘చిన్నోడు-పెద్దోడు’గా కనిపించున్న చైతు-సునీల్

Naga-Chaitanya-Sunil

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మరియు కామెడీ హీరో సునీల్ తమిళ హిట్ చిత్రం ‘వెట్టై’ రీమేక్ లో కలిసి నటిస్తున్నారు . ఈ చిత్రానికి ‘చిన్నోడు-పెద్దోడు’ అనే పేరు పరిశీలనలో వుందని సినీ వర్గాల సమాచారం . అయితే ఈ వార్త ఇంకా అధికారికంగా దృవీకరణ జరగలేదు.

బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.కిషోర్ కుమార్ (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు . డాలీ గతంలో ‘కొంచం ఇష్టం కొంచం కష్టం’ చిత్రానికి దర్శకత్వం వహించారు .
సునీల్ ఒక సిగ్గుపడే, పిరికివాడైన పోలీస్ అధికారిగా నటిస్తుండగా నాగ చైతన్య సునీల్ కి దూకుడు స్వభావం కల తమ్ముడిగా నటిస్తున్నాడు. తమన్నా మరియు ఆండ్రియా జేరేమియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version