పాపులర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి తనని ట్విట్టర్లో మరియు పేస్ బుక్లో విసిగిస్తున్న వారి మీద ఫిర్యాదు నమోదు చేశారు. వీరు తమిళ పరిశ్రమకి చెందిన కొతమంది సెలబ్రేటిల మీద అసభ్యకరమయిన కామెంట్స్ చేస్తున్నారు. వారిని ట్విట్టర్లో బ్లాక్ చేసిన చిన్మయిని తమిళం కి వ్యతిరేకి అని ముద్ర వేసి ఆమె మీద అసభ్యకరమయిన చిత్రపటాలను ప్రచురిస్తూ వచ్చారు. ఓపిగ్గా వీటన్నింటినీ భరించిన చిన్మయి విసిగిపోయి వీరి మీద న్యాయపరమయిన చర్యలు తీసుకోవాలని చెన్నై కమీషనర్ ని కలిసారు. గతంలో చాలా మంది ప్రముఖులు పలు విషయాల్లో సైబర్ క్రైమ్ వారి వద్ద ఫిర్యాదు చేశారు కానీ అసభ్యకరమయిన చిత్రపటాల గురించి ఫిర్యాదు ఇదే మొదటి సారి.