డ్రాప్ అయ్యిన “ఛావా” వసూళ్లు.. లేటెస్ట్ ఎంతంటే!

బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మికా మందన్నఆ హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా హిందీలో ఇప్పుడు వరకు డబుల్ డిజిట్స్ తో సాలిడ్ వసూళ్లు అందుకోగా ఇపుడు నాలుగో వారం లోకి వచ్చేసరికి ఇండియా వైడ్ గా వసూళ్లు ఒకింత ఎక్కువే డ్రాప్ అయ్యాయి అని చెప్పవచ్చు.

మొన్న ఆదివారం 24 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం నిన్న సోమవారం మాత్రం 7.7 కోట్లు నెట్ వసూళ్లు మాత్రమే అందుకుంది. దీనితో ఈ వర్కింగ్ డే మాత్రం ఛావా ఎక్కువే డ్రాప్ అయ్యింది అని చెప్పవచ్చు. ఇక దీనితో మొత్తంగా 480 కోట్ల మేర నెట్ వసూళ్ల మార్క్ ని ఈ చిత్రం టచ్ చేయగా ఇక ఈ వారం పూర్తయ్యేసరికి 500 కోట్ల మార్క్ ని ఈ చిత్రం టచ్ చేస్తుంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version