‘చంద్రమౌళి’ గా రానున్న ‘ఛత్రపతి’


టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ చిత్రాలను తీసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి. ఆయన తీసిన ‘మగధీర’ మరియు ‘ఈగ’ చిత్రాలు ‘మావీరన్’ మరియు ‘నాన్ ఈ’ పేరిట తమిళంలో విడుదలై అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాలతో రాజమౌళికి తమిళనాడులో భారీగానే క్రేజ్ ఏర్పడింది. మామూలుగా అనువాద చిత్రాలను తక్కువగా చేసే తమిళ నిర్మాతలే రాజమౌళి గతంలో తెలుగులో తీసిన చిత్రాలను అనువదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు శ్రియ హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని ‘చంద్రమౌళి’ గా తమిళంలోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సతీష్ ఫిల్మ్ కార్పోరేషన్ ద్వారా సతీష్ నిర్మిస్తున్నారు.

Exit mobile version