మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘తుఫాన్’ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక రేపు జరగనుంది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు అన్ని ఏరియాలలో మంచి ధరకు అమ్ముడయింది. నెల్లూరు ఏరియాలో క్రౌన్ మూవీస్ సంస్థ ఏకంగా 1.65 కోట్లకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్. అపూర్వ లిఖియా దర్శకుడు. హిందీ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు వెర్షన్ లో పలుమార్పులు చేసారు. యోగి దర్శకత్వపర్యవేక్షణ భాధ్యతలు చేపట్టాడు
రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ఫ్లైయింగ్ టర్టిల్ ఫిల్మ్స్ తో కలిసి నిర్మిస్తుంది. ఈ సినిమా ద్వారా చరణ్ బాలీవుడ్ కు పరిచయం కానున్న విషయం మనకు తెలిసినదే