‘జంజీర్’లో చరణ్ డాన్సులు జాక్సన్ ని తలపిస్తాయా?

ram-charan-teja-latest-danc

1973లో బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జంజీర్ సినిమాని రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. రచ్చ, నాయక్ సినిమాల్లో అదిరిపోయే డాన్సులు వేసి అదరగొట్టిన జంజీర్ సినిమాలో మైఖేల్ జాక్సన్ ని మించే డాన్స్ స్టెప్పులు వేసాడని జంజీర్ రీమేక్ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా అంటున్నాడు. తన ట్విట్టర్ ఎకౌంటులో దీని గురించి ఒక త్వీత్ పోస్ట్ చేసాడు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే ‘ఇప్పుడే జంజీర్ సినిమాలోని ముంబై కే హీరో పాట చిత్రీకరణ పూర్తయింది. చరణ్ ఈ పాటని చితక్కొట్టేసాడు. డాన్సులలో జాక్సన్ ని మించిపోయాడని’ అన్నాడు. బాలీవుడ్లో హ్రితిక్ రోషన్ మినహా మిగతా హీరోలు డాన్సుల అంతగా ఆసక్తి చూపించరు. చరణ్ డాన్సులతో వారి మతి పోగొట్టడం ఖాయం అనిపిస్తుంది.

Exit mobile version