బాలయ్య సినిమాకు మార్పులు చేస్తున్నారా?

బాలయ్య సినిమాకు మార్పులు చేస్తున్నారా?

Published on Jun 13, 2020 1:02 AM IST


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం హిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూడో చిత్రం తాలూకా టీజర్ వచ్చి ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనితో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ చిత్రంపై ఇప్పుడు ఒక లేటెస్ట్ గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. దర్శకుడు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ లో పలు మార్పులు చెయ్యాలని భావిస్తున్నారట. స్క్రీన్ ప్లే ను మరింత బాగా వచ్చేందుకు కొన్ని సీన్స్ ను తగ్గించాలని అనుకుంటున్నారట.

దీనికి బాలయ్య కూడా ఓ కారణం అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఇతర అనవసర హంగులు లేకుండా ఖచ్చితంగా ఉండేట్లు చెయ్యాలని బోయపాటికి సూచించారట. అందుకు తగ్గట్టుగా బోయపాటి ఇప్పుడు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేస్తున్నట్టు వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు