అమృతం ధారావాహిక ఆధారంగా తెరకెక్కుతున్న ‘చందమామలో అమృతం’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకానుంది. షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం కావస్తున్నా నిర్మాణాంతర కార్యక్రమాలు ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ సినిమాకు గుణ్ణం గంగరాజు దర్శకుడు. ఇండియాలో మొదటి స్పేస్ సినిమాగా ఈ చిత్రం రికార్డులలోకి ఎక్కింది
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘దాదాపు ఒకటి బై మూడో వంతు సినిమా చందమామ సెట్ లో తీసాము అంతేకాక 44 నిముషాలు స్పేస్ లో తీసాము. ఇవేకాక 19 నిముషాలు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ అందించాము. మేము అనుకున్న దానికంటే విజువల్ ఎఫెక్ట్స్ కు టైం పట్టినా డిసెంబర్ మూడో వారంలో విడుదల చేద్దాం అనుకుంటున్నాము’ అని తెలిపారు
అవసరాల శ్రీనివాస్, హరీష్, వాసు ఇంటూరి మరియు ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రధారులు. ఆడియో డిసెంబర్ మొదటి వారంలో విడుదలకానుంది. జస్ట్ యెల్లో మీడియా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు