‘చందమామ కథలు’లో ఈ ప్రేమకథలు ముగింపు ఏమిటి?

‘చందమామ కథలు’లో ఈ ప్రేమకథలు ముగింపు ఏమిటి?

Published on Jan 29, 2014 7:00 PM IST

Chandamama
అదొక జూనియర్ కాలేజ్, అందులోనూ కో-ఎడ్యుకేషన్, కాబట్టే అక్కడ చాలా రూల్స్, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుకోకూడదు, చూసుకోకూడదు..కానీ ఏది చేయద్దు అంటారో అదే చేయాలనిపించే వయసు కాబట్టి అలా ఒకరికొకరు సైట్ కొట్టుకోవడానికి దొరికే ఒకే టైం “బ్రేక్ టైం”. కారిడార్ లో అందరి దొంగ చూపులు, కొత్త పరిచయాలు, తొలి ప్రేమలు మొదలవుతాయి. అక్కడే మన రఘు,రేణు ప్రేమ మొదలైంది. అందం,ఆకర్షణ తప్ప ప్రేమ అంటే పెద్దగా తెలియని వయసు లో ప్రేమలో పడ్డామనుకున్నారు. అప్పుడే ఆ ప్రేమ వెనుక ఒక భయంకరమైన నిజం ఉందని తెలిసింది. దానివల్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి?

అష్రఫ్ నిజాయితీ కలిగిన పరుడు, కష్టపడి పనిచేసి యీమీ లేని స్టేజ్ నుంచి ఒక చిన్న సైజు డిపార్ట్మెంటల్ స్టోర్ ఓనర్ గా ఎదిగాడు. ఆ షాప్ కి రెగ్యులర్ గా వచ్చే ‘హసీనా’తో పరిచయం పెంచుకొని ప్రేమలో పెడతాడు. కానీ హసీనా అందరి మధ్య తరగతి అమ్మాయిల్లానే కార్లలో తిరగాలి, రెస్టారెంట్లు,మల్టీప్లెక్స్ లు,గేమింగ్ సెంటర్ లు అంటూ దర్జాగా బతకాలని కలలు కంటూ ఉంటుంది. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో వీరి జీవితాల్లో ఒక చిన్న కుదుపు…ఏంటది?

పైన చెప్పిన రెండు ప్రేమ కథలు చివరికి ఎలా ముగిసాయి అనేది తెలియాలంటే మీరు “చందమామ కథలు” సినిమా చూడాల్సిందే. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాలుగు విభిన్న కథలను చూపించారు. ఫిబ్రవరి చివర్లో రానున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు