భారీ ఎత్తున సిసిఎల్ – 3 కర్టన్ రైజర్

CCL
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మూడవ దశ ప్రారంభోత్సవం భారీ ఎత్తున జరగనుంది. ఈ ఈవెంట్ ముంబై ఫిలిం సిటీలో 19న జరగనుంది. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్టు సమాచారం. చార్మీ మరియు శ్రద్ద దాస్ ఇప్పటికే ప్రదర్శన ఇవ్వనున్నట్టు ఖరారు అయ్యింది. ఈ కార్యక్రమంలో గంగ్నాం స్టైల్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు పుకారు ఉంది. టాలివుడ్ తరుపున తెలుగు వారియర్స్ పేరుతో వెంకటేష్ నాయకుడిగా మన టీం వెళ్లనుంది. నితిన్, శ్రీకాంత్,ఆదర్శ ఈ టీంలో కీలక పాత్ర పోషించనున్నారు ఈ ఏడాది మరో రెండు టీంలు ఈ ఈవెంట్ లో కలిసాయి. రితేష్ దేశ్ ముఖ్ వీర్ మరాఠీ మరియు భోజ్ పూరి దబాంగ్ టీం లు ఈ ఏడాది కొట్టగా ఆడనున్నాయి. తెలుగు,తమిళ్,కేరళ,కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు బాలీవుడ్ టీం లతో ఈ రెండు టీంలు జత కానున్నాయి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 9న కోచి లో మొదలు కానుంది.

Exit mobile version