రాజమౌళి ఎప్పుడూ అంచనాలు తప్పడు అని ఆర్ ఆర్ ఆర్ చరణ్ ఇంట్రో వీడియో నిరూపించింది. ఓ నిమిషం నిడివి గలిగిన ఆ వీడియోలో చరణ్ ని రాజమౌళి ప్రెజెంట్ చేసిన తీరు ఆర్ ఆర్ ఆర్ మామూలు స్థాయిలో ఉండదనే భావన కలిగింది. గంభీరమైన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ నేపథ్యంలో రన్ అవుతూ ఉంటుంటే స్క్రీన్ పై చరణ్ భీభత్సం చేసేశాడు. ఐతే ఆ వీడియోలో చరణ్ బేర్ బాడీ, కండలు తిరిగిన శరీరం ప్రత్యేకంగా నిలిచింది. ఆయుధాలు ఉపయోగించేటప్పుడు చరణ్ బాడీ షేప్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించింది.
మరి మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా కొమరం భీమ్ ఇంట్రో విడుదల కానుంది.ఆర్ ఆర్ ఆర్ నుండి రానున్న కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ఏ స్థాయిలో ఉండనుందనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. రాజమౌళి చరణ్ కి మాదిరి ఎన్టీఆర్ ని కూడా బేర్ బాడీ లో ప్రజెంట్ చేస్తాడా లేదా అనే డౌట్ అందరిలో మొదలైపోయింది. ఇటీవల లీకైన ఎన్టీఆర్ పులితో ఫైట్ సన్నివేశానికి సంబందించిన ఫోటోలలో ఎన్టీఆర్ చొక్కా లేకుండా ఉన్నాడు. అలాగే ఈ సినిమా కోసం స్టీవ్ లాయిడ్స్ అనే ఫిట్నెస్ ట్రైనర్ దగ్గర కొన్నాళ్లు శిక్షణ తీసుకొని ఎన్టీఆర్ కండలు పెంచాడు. కాబట్టి ఎన్టీఆర్ అని కూడా రాజమౌళి బేర్ బాడీ తో పరిచయం చేసే అవకాశం ఉంది.