మాస్ మహారాజ్ రవితేజ తన కొత్త సినిమాను ఇటీవల ఎలాంటి సైలెంట్ షూటింగ్ ప్రారంభించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రియలిస్టిక్ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. అయితే, ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్‌ను పెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. రవితేజ సినిమాలకు ఇది చాలా యూనిక్ టైటిల్‌గా భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 సమ్మర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం రవితేజ భారీగా డేట్స్ కేటాయించారని.. శివ నిర్వాణ షూటింగ్ త్వరగా ముగించాలని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమా కోసం రవితేజ ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో పనిచేస్తున్నారు.


