మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘విశ్వంభర’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. కొంత షూటింగ్ ప్యాచ్ వర్క్, వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. అయితే, రీసెంట్‌గా ఈ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సాంగ్ షూటింగ్ ముగిసిందని.. సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని మేకర్స్ తెలిపారు. దీంతో విశ్వంభర చిత్ర షూటింగ్ పూర్తయ్యిందని.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారని సినీ సర్కిల్స్‌లో టాక్ జోరందుకుంది.
అయితే, మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.