పెద్ద ఎత్తున జరగనున్న చిన్న సినిమా ఆడియో

పెద్ద ఎత్తున జరగనున్న చిన్న సినిమా ఆడియో

Published on Oct 11, 2012 8:40 PM IST


‘ఈ రోజుల్లో’ అనే ఒక చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కొట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు మారుతి. ‘ఈ రోజుల్లో’ సినిమాతో బాగా పేరు తెచ్చుకున్న మారుతి ఆ సినిమాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోక ముందే ‘బస్ స్టాప్’ అనే మరో సినిమాతో రానున్నారు. ‘లవర్స్ అడ్డా’ అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ఆడియోని పెద్ద ఎత్తున ఈ నెల 13న శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ ఆడియో వేడుకకి పలువురు ఇండస్ట్రీ పెద్దలు రానున్నట్లు సమాచారం. ప్రిన్స్, శ్రీ దివ్య మరియు రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జె. బి సంగీతం అందించారు. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లం కొండ సురేష్ మరియు బెల్లంకొండ గణేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు