పరిశ్రమలో అల్లు అర్జున్ ఉత్తమ డాన్సర్స్ లో ఒకరు. ఆయన వేసే స్టెప్స్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫిలింనగర్లో తాజా సమాచారం ప్రకారం బన్నీ “జులాయి” చిత్రం కోసం కొన్ని కొత్త రకమయిన స్టెప్స్ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కొరియోగ్రాఫర్ తో కలిసి కొత్త రకమయిన స్టెప్స్ కోసం బన్నీ కష్టపడ్డారు. డాన్స్ ప్రేమికులకు మరియు అల్లు అర్జున్ అభిమానులకు ఇది ఆనందకరమయిన విషయం. భారీ అంచనాల నడుమ “జులాయి” ఆగస్ట్ 9న విడుదలకు సిద్దమయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాధా కృష్ణ నిర్మించగా దానయ్య సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించింది. సోను సూద్ మరియు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.