చరణ్ ‘నాయక్’ సినిమాకి భారీ డిమాండ్

చరణ్ ‘నాయక్’ సినిమాకి భారీ డిమాండ్

Published on Nov 19, 2012 8:25 AM IST


రామ్ చరణ్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో నటిస్తే అందులో మూడు సినిమాలు హిట్. అందులో మగధీర, రచ్చ సినిమాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకి కాసుల పంట పండించాయి. ఇప్పుడు వివి వినాయక్ డైరెక్షన్లో వస్తున్న ‘నాయక్’ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది. చరణ్ ట్రాక్ రికార్డు బావుండటం, రచ్చ తో హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న చరణ్ సినిమా అనగానే డిస్ట్రిబ్యూటర్లు భారీ అమౌంట్ పెట్టడానికి అయినా సరే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నైజాం, వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర ఏరియాల్లో చరణ్ గత సినిమాలకంటే అత్యధిక మొత్తం చెల్లించడానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారని సమాచారం. చరణ్ ఈ సినిమాలో మొదటిసారి ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు. కాజల్, అమల పాల్ ఆయనకి జోడీగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు