బ్రదర్స్ సెన్సార్ పూర్తయింది

బ్రదర్స్ సెన్సార్ పూర్తయింది

Published on Oct 9, 2012 2:15 PM IST


సూర్య అవిభక్త కవలలుగా దిపాత్రాభినయంలో నటిస్తున్న సినిమా బ్రదర్స్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 12న విడుదల చేస్తున్న ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా ఈ సినిమాకి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ దక్కింది. బ్రదర్స్ సినిమాని చుసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికేట్ అందించారు. సూర్య సరసన కాజల్ నటించిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. మొదట డమరుకం అక్టోబర్ 11న భావించినప్పటికీ ఆ సినిమా వాయిదా పడటం సూర్యకి తెలుగులో భారీ క్రేజ్ ఉండటంతో ఈ సినిమాని భారిగా విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు