ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలయికతో ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్

హాస్యబ్రహ్మ పద్మశ్రీ డా.బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఓ ఫుల్ ఫ్లెడ్జ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా నటిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్‌తో సాగింది.

థియేటర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మ ఆనందం ఢిల్లీలో జరిగే నేషనల్ షో లో పాల్గొనాలని అనుకుంటాడు. అయితే, దీని కోసం డబ్బులు అవసరం పడటంతో, బ్రహ్మానందం మనవడిగా నటించేందుకు అంగీకరిస్తాడు. ఇక వారిద్దరి మధ్య జరిగే పరిణామాలను మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌లో రాజా గౌతమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా పలికించిన తీరు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version