బోయపాటి “బావ” సెంటిమెంట్

బోయపాటి “బావ” సెంటిమెంట్

Published on Apr 13, 2012 8:34 AM IST


కమర్షియల్ దర్శకుడిగా బోయపాటి శ్రీను తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అతను చేసిన మూడు చిత్రాలు మంచి విజయాలు సాదించాయి. ఆయన ప్రతి చిత్రంలో “బావ” పాత్ర చిత్రం కీలకంగా మారుతుంది. “భద్ర” చిత్రంలో దీపక్ మీరా జాస్మిన్ అన్నయగా కనిపిస్తారు. “తులసి” చిత్రంలో శివాజీ నయనతార అన్నయగా కనిపిస్తారు. రెహమాన్ “సింహ” చిత్రంలో నయన తారకి అన్నయగా కనిపిస్తారు. ఈ మూడు చిత్రాలలో ఈ మూడు పాత్రలు కీలకమయినవే. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇది బోయపాటి సెంటిమెంట్ అంటున్నారు. ఇలాంటి ఒక పాత్రను మనం ఎన్టీయార్ రాబోతున్న చిత్రం “దమ్ము”లో కూడా చూడబోతున్నాం ఈ పాత్రను వేణు పోషిస్తున్నారు.

వేణు బాల కృష్ణ కు బావగా కనిపించబోతున్నారు. ఈ సెంటిమెంట్ మళ్ళి పని చేస్తుందా? చిత్రం భారీ విజయం సాదిస్తుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి మరి ఏమవుతుందనేది కోసం వేచి చూడాలి.

తాజా వార్తలు