బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రతిచోటా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా రెవిన్యూనే హాట్ టాపిక్ గా మారింది. అందరికి బాగా తెలిసిన బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ మరియు కొంతమంది ఓపెన్ గా ఈ సినిమా కలెక్షన్స్ పట్ల తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమా గురించి తన ట్విట్టర్ లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ‘ నా మొత్తం కెరీర్లో నేను ఏ సినిమా కలెక్షన్స్ కి షాక్ అవ్వని రీతిలో అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్స్ చూసి షాక్ అయ్యానని తరన్ ఆదర్శ్ నాతో అన్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొదటిసారి హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీలు తెలుగు సినిమా సినిమా అయిన అత్తారింటికి దారేది కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాయని’ వర్మ ట్వీట్ చేసాడు.
ప్రస్తుత సమాచారం ప్రకారం యుఎస్ లో త్వరలోనే ఈ సినిమా 2 మిలియన్ బోర్డర్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. మేము పవన్ అభిమానులకు అందిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టామినా ఇదే..