శేఖర్ రావ్జియని – విశాల డడ్లని అనే ఇద్దరూ విశాల్ – శేఖర్ అనే పేరుతో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా అందరికీ తెలుసు. వీరిద్దరూ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. వారి కాంబినేషన్లో రీసెంట్ గా వచ్చిన మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’.
శేఖర్ సోలోగా ‘బట్టర్ ఫ్లై’ అనే ఓ తెలుగు పాటని కంపోజ్ చేసారు. ఇది శేఖర్ చేసిన మూడవ సోలో సాంగ్. ఇది వరకు ‘సాజ్ని’, ‘సావ్లి’ అనే రెండు మరాఠి పాటలను కంపోజ్ చేసాడు. ప్రస్తుతం ‘బట్టర్ ఫ్లై’ సాంగ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో బాగా ఫేమస్ అవ్వడమే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు ఈ పాటని ట్వీట్ చేస్తున్నారు.
టాలెంటెడ్ సింగర్ చిన్మయి శ్రీపాద పాడిన ఈ రొమాంటిక్ సాంగ్ కి రాకేందు మురళి సాహిత్యం అందించారు. ఈ పాటని మీరు www.shekharravjiani.com వెబ్ సైట్లో మరియు ఐ ట్యూన్స్ http://t.co/NUO7gtfDVV లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సాంగ్ డౌన్ లోడ్స్ ద్వారా వచ్చే అమౌంట్ ‘మా నికేతన్’ అనే ట్రస్ట్ కి వెళుతుంది. మా నికేతన్ అనేది ఆడపిల్లలకి చదువు చెప్పే ఓ స్వచ్చంద సంస్థ.
మీరు కూడా ఈ పాటని డౌన్ లోడ్ చేసుకొని వారికి మీ వంతు సహాయాన్ని అందించండి.