ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఈగ” చిత్రం ఇక్కడ భారీ విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేస్తున్నారు. అక్టోబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే బాలివుడ్ విలేఖరులను మరియు ట్రేడ్ అనలిస్ట్ లను ఆకట్టుకుంది. ముంబై లో పి వి ఆర్ లో ఈ చిత్రం ఈరోజు ప్రదర్శితమయ్యింది ఈ ప్రదర్శనకు ఎస్ ఎస్ రాజమౌళి, ఎం ఎం కీరవాణి,నాని, సురేష్ బాబు, సాయి కొర్రపాటి, పీట్ డార్పర్ మరియు అనుజ్ గుర్వర హాజరయ్యారు. ఈ ప్రదర్శన తరువాత చిత్రాన్ని పాత్రికేయులు ప్రశంసలలో ముంచెత్తారు. ముంబైలో ప్రసిద్ద విమర్శకుడు తరణ్ ఆదర్శ్ “ఈగ(మక్కీ)” చిత్రాన్ని ఈ ఏడాది విడుదలయిన ఉత్తమ చిత్రాలలో ఒకటి అని ప్రశంసించారు. CNN – IBN ఛానల్ కి సిని విమర్శకుడిగా ఉన్న రాజీవ్ మసంద్ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూసినట్టు పేర్కొన్నారు. వీళ్ళే కాకుండా పలువురు విమర్శకులు ఈ చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తారు. “మక్కీ” చిత్రం అక్టోబర్ 12న రాణి ముఖర్జీ మరియు పృథ్వి రాజ్ ప్రధాన పాత్రలలో వస్తున్న “అయ్యా” చిత్రం మరియు రామ్ గోపాల్ వర్మ “భూత్ రిటర్న్స్” చిత్రాలతో కలిసి విడుదల కానుంది. ఈ ప్రదర్శన తరువాత వచ్చిన స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాదించేలా కనిపిస్తుంది. చూస్తుంటే తెలుగు చిత్ర పవర్ ఏంటో ఈ చిత్రం ద్వారా బాలివుడ్ తెలుసుకోనున్నట్టు తెలుస్తుంది.
ఈగను తెగ మోసేస్తున్న బాలీవుడ్ మీడియా
ఈగను తెగ మోసేస్తున్న బాలీవుడ్ మీడియా
Published on Oct 5, 2012 12:26 PM IST
సంబంధిత సమాచారం
- హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. పుట్టినరోజే గుడ్ న్యూస్ షేర్ చేసాడుగా
- చిరు కోసం సైకిల్ యాత్ర చేసిన మహిళా వీరాభిమాని.. మెగాస్టార్ భరోసా
- హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ సింపుల్ పోస్ట్!
- తెలుగులో దుల్కర్ ‘కొత్త లోక’ మార్నింగ్ షోస్ క్యాన్సిల్!
- స్ట్రాంగ్ బజ్: ‘ఓజి’ కోసం పవన్ మరోసారి!?
- ట్రైలర్ తర్వాత ‘మిరాయ్’ పై మరిన్ని అంచనాలు!
- ‘ఓజి’ ఫీవర్.. యూఎస్ మార్కెట్ ని టేకోవర్ చేస్తున్న పవర్ స్టార్!
- ‘విశ్వంభర’ కోసం ఈ ఓటీటీ సంస్థ?
- ఘట్టమనేని హీరో కోసం విలన్‌గా మారిన మోహన్ బాబు..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- అఖండ 2 తప్పుకోవడంతో సింగిల్‌గా దిగుతున్న ఓజి.. ఇక రికార్డులు గల్లంతే..!
- వీడియో : మిరాయ్ ట్రైలర్ (తేజ సజ్జా, మంచు మనోజ్)