నా సినిమాని రాజమౌళి చూడాలి.!

నా సినిమాని రాజమౌళి చూడాలి.!

Published on Nov 18, 2012 12:03 PM IST


తెలుగులో వచ్చి హిట్ అయిన ‘మర్యాద రామన్న’ సినిమాకి రిమేక్ గా తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సర్దార్’ ఈ దీపావళికి హిందీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని పంజాబీ నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసారు. ఈ సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్ అవడంతో ఈ చిత్ర దర్శకుడు అశ్విని ధీర్ తన సినిమాని ఒరిజినల్ వెర్షన్ తీసిన ఎస్.ఎస్ రాజమౌళి చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ‘ మా సినిమాని రాజమౌళి చూడాలని కోరుకుంటున్నాను, అలాగే మేము చేసిన మార్పులు ఎలా ఉన్నాయో అనే దాని మీద ఆయన అభిప్రాయం ఏమిటో చెప్పాలి. చాలా వరకూ మార్పులు చేసిన ఈ సినిమాలో అజయ్ కామెడీ ఆద్యంతం నవ్విస్తుందని’ అన్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’, ‘విక్రమార్కుడు’ మరియు ‘ఈగ’ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

తాజా వార్తలు