ఛాన్స్ మిస్ చేసుకున్న బోల్డ్ హీరోయిన్ ?

ఛాన్స్ మిస్ చేసుకున్న బోల్డ్ హీరోయిన్ ?

Published on Apr 17, 2020 5:08 PM IST


బోల్డ్ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ ఫస్ట్ మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకోవడంతో, ఇండస్ట్రీలో సక్సెస్ హీరోయిన్ గా మారిపోతుందని అనుకున్నారు, కానీ.. అలా జరగలేదు. నిజానికి స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని పాయల్ కు ఉండటంతో.. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు పాయల్ మెయిన్ ఆప్షన్ అవుతుందనుకున్నారు. అయితే కాలం కలిసి రాక, అవగాహనా రాహిత్యం కారణంగా చిన్న చితకా చిత్రాలకు, సీనియర్ హీరోల పక్కన సెకెండ్ లీడ్ కే మాత్రం పరిమితం అయిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఈ మధ్య ఆ ఛాన్స్ లు కూడా మిస్ అవుతున్నాయి.

మొదట బాలయ్య – బోయపాటి సినిమాలో ప్లాష్ బ్యాక్ స్టోరీలో పాయల్ ను బాలయ్యకు జోడిగా అనుకున్నారు. ఏమైందో ఏమో కొత్త హీరోయిన్ కే ఆ ఛాన్స్ వెళ్ళిపోయింది. బాలయ్య సినిమాలో ఛాన్స్ ఎందుకు మిస్ అయిందో పాయల్ కే తెలియాలి. తన బోల్డ్ నెస్ గ్లామర్ తో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్నా చివరకు ఆమెకు మాత్రం ఒరిగిందేమి లేదు. ఆ మధ్య వచ్చిన వెంకీమామ సినిమా మినహా.. పాయల్ కి పెద్ద ఛాన్సే రాకుండా పోయింది. పోనీ, చిన్న హీరోల పక్కన అన్నా మెయిన్ లీడ్ వస్తున్నాయా అంటే ప్రెజెంట్ అలాంటి క్యారెక్టర్స్ కూడా మిస్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు